- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Wayanad : వయనాడ్ మృతుల సంఖ్య 413.. కానరాని 152 మంది ఆచూకీ
దిశ, నేషనల్ బ్యూరో : కేరళలోని వయనాడ్‌లో భారీ వర్షాల కారణంగా ఇటీవలే కొండచరియలు విరిగిపడిన ఘటనలో మరణాల సంఖ్య మరింత పెరిగి 413 దాటింది. రెస్క్యూ ఆపరేషన్ గురువారంతో పదో రోజుకు చేరుకున్నప్పటికీ ఇంకా 152 మంది ఆచూకీ దొరకలేదు. చలియార్ నది ప్రవాహించే మార్గంలో నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్‌లో 78 మృతదేహాలను వెలికితీశారు. 150కిపైగా శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తుల గుర్తింపు కోసం ఈ శరీర భాగాల శాంపిల్స్‌ను సేకరించి డీఎన్‌ఏ పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపుతారు. అనంతరం మృతదేహాలు, శరీర భాగాలను ఖననం చేస్తారు. శరీర భాగాలు మాత్రమే ఉన్న ప్రతీ సమాధి ఎదుట ఒక ప్రత్యేక నంబరును రాసి పెడతారు.
సదరు శరీర భాగాలు ఏ కుటుంబానికి చెందిన వారివి అనే విషయం డీఎన్‌ఏ రిపోర్టు వచ్చిన తర్వాత తెలుస్తుంది. డీఎన్ఏ శాంపిల్ మ్యాచ్ అయినవారు వచ్చి తమ కుటుంబీకుల సమాధులను కచ్చితత్వంతో గుర్తించేందుకు ఈవిధంగా వాటికి నంబరింగ్ ఇచ్చారు. వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో 100కుపైగా సహాయక శిబిరాలు ఉన్నాయి. వాటిలో దాదాపు 10,800 మందికిపైగా ఆశ్రయం పొందుతున్నారు. ఈ ప్రాంతంలో పాఠశాలలను తిరిగి ప్రారంభించేందుకు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని, అప్పటి వరకు పిల్లలకు ఆన్‌లైన్‌లో విద్యను బోధించేందుకు ఏర్పాట్లు చేస్తామని కేరళ విద్యాశాఖ మంత్రి వి.శివంకుట్టి తెలిపారు.