- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాహుల్ గాంధీ రాజీనామా.. ఉప ఎన్నిక తేదీ ఖరారు
దిశ, వెబ్‌డెస్క్: గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) రెండు స్థానాల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. ఒకటి కేరళ(Kerala) రాష్ట్రంలోని వయనాడ్, రెండోది ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh)లోని రాయబరేలీ నియోజకవర్గం. అయితే ఈ రెండు స్థానాల్లోనూ రాహుల్ గాంధీ విజయం సాధించారు. దీంతో అనివార్యంగా ఒక స్థానానికి రాజీనామా చేయాల్సిన అనివార్య పరిస్థితి రాగా, వయనాడ్‌కు రాజీనామా చేశారు. తాజగా.. వయనాడ్ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) మంగళవారం విడుదల చేసింది. నవంబర్ 13న ఉప ఎన్నిక జరుగనుంది.
వయనాడ్‌తో పాటు దేశ వ్యాప్తంగా 48 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నిక జరుగనుంది. వీటన్నింటికి అక్టోబర్ 18న నోటిఫికేషన్, నవంబర్ 13న ఉప ఎన్నిక, నవంబర్ 23న ఫలితాలు విడుదల చేయనున్నారు. మరోవైపు.. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. మహారాష్ట్రలో ఒకే దశలో, జార్ఖండ్‌లో రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మహారాష్ట్రలో నవంబర్ 20న పోలింగ్ జరగనుండగా.. జార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయన్నారు. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు నవంబర్ 23న చేపట్టనున్నట్లు వెల్లడించారు.