నీటి సంక్షోభాన్ని పరిష్కరించకుంటే ఆందోళనలు: ఢిల్లీ మంత్రి అతిశీ వార్నింగ్

by vinod kumar |
నీటి సంక్షోభాన్ని పరిష్కరించకుంటే ఆందోళనలు: ఢిల్లీ మంత్రి అతిశీ వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో నీటి ఎద్దడిపై తాను ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశానని, రెండు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించకుంటే జూన్ 21 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని మంత్రి అతిశీ హెచ్చరించారు. బుధవారం ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. హర్యానా నీటి వాటాను విడుదల చేయనందున ఢిల్లీ తీవ్ర నీటి సంక్షోభంతో పోరాడుతోందన్నారు. 613 ఎంజీడీలకు గాను 513 ఎంజీడీల నీటిని మాత్రమే హర్యానా విడుదల చేసిందని తెలిపారు. 28,500 మందికి ఒక ఎంజీడీ నీరు అవసరమని చెప్పారు. కాబట్టి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హర్యానా చర్యల వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని చెప్పారు. ప్రజలు వేడిగాలులతో పోరాడడమే కాకుండా నీటి కొరతతో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ స్పందంచకుంటే నిరవధిక సమ్మెకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు తాము హర్యానా ప్రభుత్వానికి సైతం పలుమార్లు లేఖలు రాశామని గుర్తు చేశారు.

Advertisement

Next Story

Most Viewed