లిక్కర్ స్కాం కేసు ఫేక్.. అరవింద్ కేజ్రివాల్ కీలక వ్యాఖ్యలు

by Vinod kumar |
లిక్కర్ స్కాం కేసు ఫేక్.. అరవింద్ కేజ్రివాల్ కీలక వ్యాఖ్యలు
X

న్యూఢిల్లీ: లిక్కర్ స్కాంలో అవినీతి ఆరోపణలతో సుమారు 9 గంటల పాటు సీబీఐ విచారణ తర్వాత బయటకొచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ మీడియాతో మాట్లాడారు. సీబీఐ తనను 56 ప్రశ్నలు వేసినట్లు చెప్పారు. అన్నింటికి సమాధానాలు చెప్పానన్నారు. అయితే ఈ కేసు అంతా ఫేక్ అని చెప్పారు. వారి వద్ద ఒక్క ఆధారం కూడా లేదని తాను విశ్వసిస్తున్నానని తెలిపారు. లిక్కర్ పాలసీ అమలులోకి 2020 నుంచి ప్రతి ఒక్క అంశాన్ని సీబీఐ ప్రశ్నించిందన్నారు. లిక్కర్ పాలసీ కేసు పూర్తి అబద్దమని, కల్పితమని చెప్పారు. నిజాయితీ తమ భావజాలమని తెలిపారు. చావనైనా చస్తాం కానీ నిజాయితీని వీడమని స్పష్టం చేశారు. తాము చేసిన మంచిని, అభివృద్ది పనులను తప్పుగా చూపించేందుకు ఇవన్నీ చేస్తున్నారని విమర్శించారు.

జాతీయ పార్టీగా ఉన్న తమకు ముగింపు పలికేందుకు ఇలా చేస్తున్నారని కేజ్రివాల్ అన్నారు. అయితే దేశ ప్రజలు తమతోనే ఉన్నారని తెలిపారు. మరోసారి విచారణకు పిలిచే అవకాశం కూడా లేదని కేజ్రివాల్ పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ నేత అజయ్ మాకెన్ తన పార్టీకి కీలక విజ్ఞప్తి చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ చీఫ్‌పై ఎలాంటి సానుభూతి చూపొద్దని పార్టీ నేతలను కోరారు. ఒకవేళ అదే చేస్తే కాంగ్రెస్ గందరగోళంలో పడటమే కాకుండా, బీజేపీకి ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే ఢిల్లీ సీఎం కేజ్రివాల్‌తో మాట్లాడిన మరుసటి రోజే ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed