ఓటు ఫస్ట్.. పెళ్లి నెక్ట్స్! పెళ్లి బట్టలతోనే పోలింగ్ కేంద్రాలకు..

by Ramesh N |   ( Updated:2024-04-19 13:09:59.0  )
ఓటు ఫస్ట్.. పెళ్లి నెక్ట్స్! పెళ్లి బట్టలతోనే పోలింగ్ కేంద్రాలకు..
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభం అయ్యింది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 102 లోక్‌సభ స్థానాల్లో ఉదయం 7 నుంచి పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. సాధారణ పౌరులతోపాటు ప్రముఖులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి బట్టలతో వచ్చి మరి ఇద్దరు పెళ్లి వేడుకలు పక్కన పెట్టి మరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉత్తరప్రదేశ్ - ముజఫర్‌నగర్‌లో దీప అనే అమ్మాయి పెళ్లి బట్టలతోనే పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మరోవైపు ఉత్తరాఖండ్ - పౌరీ గర్వాల్‌లోని పోలింగ్ బూత్‌లో కొత్తగా పెళ్లయిన జంట ఓటు వేశారు. ఈ క్రమంలోనే జమ్మూకాశ్మీర్ ఉధంపూర్‌లో పెళ్లి వేడుకలు పక్కన పెట్టి ఓ జంట ఓటు వేశారు. ఈ సందర్భంగా జమ్మూకాశ్మీర్ చెందిన వధువు రాధిక శర్మ మాట్లాడుతూ.. నిన్న మా పెళ్లి వేడుక జరిగింది. ఈ రోజు వీడ్కోలు ఆచారాల తర్వాత మా ఓట్లు వేయాలని నా భర్తతో చెప్పాను. తమ ఓటును వృధా చేయకూడదని నేను అందరికీ తెలియజేశాను.

Advertisement

Next Story