- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కాంగ్రెస్‌కు ఓటేయండి.. బీజేపీ దోపిడిని అంతం చేయండి: సోనియా గాంధీ

బెంగళూరు: కాంగ్రెస్‌కు ఓటేసి బీజేపీ దోపిడిని అంతం చేయాలంటూ హస్తం పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఓటర్లకు పిలుపునిచ్చారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో తొలిసారిగా పాల్గొన్న సోనియా.. బీజేపీ పై విమర్శనాస్త్రాలు సంధించారు. హుబ్లీలో శనివారం నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడుతూ, దేశమైనా, రాష్ట్రమైనా పురోగమించాలంటే ముందు బీజేపీ దోపిడీ, విద్వేషపూరిత వాతావరణాన్ని అంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ దోపిడి అంతం కావాలంటే కాంగ్రెస్‌కు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
‘నాయకుల భవితవ్యాన్ని ప్రజలే నిర్ణయిస్తారు. బీజేపీ దోపిడిని ఆపాలంటే దయచేసి కాంగ్రెస్‌కు ఓటేసి, మెజార్టీతో గెలిపించండి’ అని కోరారు. తాము అధికారంలోకి వస్తే, కర్ణాటకను అవినీతి రహితంగా మారుస్తామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో చేసిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని, కర్ణాటకలోనూ మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలన్నీ అమలు చేస్తామని స్పష్టం చేశారు.