VK Saxena: ఎల్జీ సక్సేనా వెంటనే రాజీనామా చేయాలి.. ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్

by vinod kumar |
VK Saxena: ఎల్జీ సక్సేనా వెంటనే రాజీనామా చేయాలి.. ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలోని రిడ్జ్ ప్రాంతంలో 1,100 చెట్ల నరికివేతకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమోదం తెలపడంపై ఢిల్లీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(నేత) సౌరభ్ భరద్వాజ్ స్పందించారు. చెట్ల నరికివేత సరికాదని, దీనికి పర్మిషన్ ఇచ్చినందుకు గాను సక్సేనా తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్ట్‌లో పాల్గొన్న కాంట్రాక్టర్ దాఖలు చేసిన అఫిడవిట్‌లో చెట్లను నరికివేసేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి ఇచ్చారని తేలిందని చెప్పారు. ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ(డీడీఏ) నుంచి వచ్చిన ఇమెయిల్‌లో, దారికి అడ్డంకిగా ఉన్న చెట్లను తొలగించడానికి అనుమతి ఇచ్చారని తెలిపారు. కాబట్టి సక్సేనా వెంటనే రాజీనామా చేయాలని చెప్పారు. అలాగే రహదారి విస్తరణ ప్రాజెక్ట్ కోసం రిడ్జ్ ఫారెస్ట్‌లో 1,100 చెట్లను నరికివేయడంపై వైస్ చైర్మన్‌పై సుప్రీంకోర్టు ధిక్కార చర్యలను ప్రారంభించినట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed