- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vistara : విమాయాన రంగంలో ముగిసిన విస్తారా ప్రస్థానం
దిశ, వెబ్ డెస్క్: విమానయాన రంగంలో ఎయిర్ విస్తారా(Air Vistara) ప్రస్థానం ముగిసిపోయింది. చివరిసారిగా ఎగిరిన విస్తారా విమానానికి విస్తారా సిబ్బంది భావోద్వేగంతో తుది వీడ్కోలు పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తొమ్మిదేళ్లుగా సేవలు అందించిన విస్తారా విమానయాన సంస్థ సోమవారం సాయంత్రం తన చివరి సర్వీసును నడిపింది. టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంయుక్త సంస్థ విస్తారా.... టాటా గ్రూప్(Tata Group)కు చెందిన ఎయిర్ ఇండియాలో విలీనమైంది. ఇక నుంచి విస్తారాకు సంబంధించిన హెల్ప్ డెస్క్, టిక్కెట్స్ వంటి అన్ని రకాల కార్యకలాపాలు ఎయిర్ ఇండియా చూసుకోనుంది. ఇప్పటికే విస్తారా బుకింగ్స్, లాయాల్టీ ప్రోగ్రామ్‌లో ఉన్న ప్రయాణికులను ఎయిర్ ఇండియాకు బదిలీ చేసే ప్రక్రియ కొన్ని నెలలుగా సాగుతోంది. విమాన సర్వీసుల్లో నాణ్యమైన ఆహారం, సర్వీస్, క్యాబిన్ ప్రమాణాల ద్వారా విస్తారా కస్టమర్ల ఆదరణ సంపాందించింది. విస్తారా బ్రాండ్‌ను నిలిపివేయాలనే నిర్ణయం పట్ల అభిమానులతో పాటు బ్రాండింగ్ నిపుణులు, విమానయాన విశ్లేషకులలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
విస్తారా సర్వీసులను మరికొన్ని సంవత్సరాలు కొనసాగించాల్సిందని..విస్తారా సేవలు నిలిచిపోవడంతో భారత్‌లో ప్రీమియం సేవలు అందించే రంగంలో శూన్యత ఏర్పడిందని ఆ సంస్థకు చెందిన కస్టమర్లు అభిప్రాయపడుతున్నారు. ఎయిర్ ఇండియా సర్వీసులు నాసిరకంగా ఉంటాయనే ఫిర్యాదులు నేపథ్యంలో వారు విస్తరా విలీనం తర్వాత సేవలపై సందేహలు వినిపిస్తున్నారు. అయితే మున్ముందు కూడా విస్తారా స్థాయి ప్రమాణాలను ప్రయాణికులకు అందిస్తామని టాటా గ్రూప్ హామీ ఇస్తోంది. విస్తారా- ఎయిర్ ఇండియాల సంయుక్త బలంతో టాటా గ్రూప్ మార్కెట్‌లో లీడర్‌గా ఉన్న ఇండిగోతో పోటీ పడేందుకు మెరుగైన స్థితిలో నిలబడే అవకాశం ఉంది. విలీన ప్రక్రియతో ఏర్పడిన సమస్యలను అధిగమించి కస్టమర్లకు మెరుగైన సేవలందించేందుకు పాత విమానాల్లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు 400 మిలియన్ డాలర్లు కేటాయిస్తున్నట్లు టాటా గ్రూప్ ప్రకటించింది. అలాగే, వందలకొద్ది కొత్త ఎయిర్ బస్సులు, వందల కోట్ల విలువ గల బోయింగ్ విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చామని పేర్కోంది.