భువనేశ్వర్‌లో విస్తారా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

by S Gopi |
భువనేశ్వర్‌లో విస్తారా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం దెబ్బతినడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. బుధవారం భువనేశ్వర్ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన నిమిషాల తర్వాత తిరిగి వచ్చి వడగళ్ల వానలో చిక్కుకుని దెబ్బతినడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్టు ఓ అధికారి తెలిపారు. విండ్‌షీల్డ్‌పై పగుళ్లు రావడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్టు పేర్కొన్నారు. విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 169 మంది ప్రయాణీకులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. ఓడిశా రాజధాని భువనేశ్వర్ సహా పలు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహనం నుంచి వడగండ్ల వాన కురిసింది. అందుకే విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాల వ్యవధిలోనే మళ్లీ భువనేశ్వర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. వడగండ్ల వాన కారణంగానే విమానం దెబ్బతిన్నదని, విండ్‌షీల్డ్ పగుళ్లిచ్చినట్టు బిజూ పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed