Vistara Flight: భద్రతా కారణాలతో ముంబై-ఫ్రాంక్‌ఫర్ట్ విమానాన్ని టర్కీకి మళ్లించిన విస్తారా

by S Gopi |
Vistara Flight: భద్రతా కారణాలతో ముంబై-ఫ్రాంక్‌ఫర్ట్ విమానాన్ని టర్కీకి మళ్లించిన విస్తారా
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ విమానయాన సంస్థ విస్తారాకు చెందిన విమానంలో శుక్రవారం భద్రతా లోపాలు బయటపడ్డాయి. ముంబై నుంచి ఫ్రాంక్‌ఫర్ట్ వెళ్తున్న యూకే27 విమానంలో భద్రతాపరమైన లోపాలు తలెత్తడంతో విమానాన్ని టర్కీలోని విమానాశ్రయానికి మళ్లించారు. ఈ మేరకు విస్తారా సంస్థ ఎక్స్‌లో ట్వీట్ చేసింది. రాత్రి 7:05 గంటలకు ఎర్జురం విమానాశ్రయంలో ఫ్లైట్ సురక్షితంగా ల్యాండ్ చేసినట్టు తెలిపింది. విమానంలోని ఓ టాయిలెట్‌లో బెదిరింపు నోట్ కనిపించిన కారణంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనిపై విస్తారా అధికారికంగా ప్రకటన జారీ చేయాల్సి ఉంది. సమాచారం తెలిసిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రొటోకాల్‌ను అనుసరించి తనిఖీలను పూర్తి చేయడానికి భద్రతా ఏజెన్సీలకు విస్తారా పూర్తిగా సహకరిస్తోంది. ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారని సంస్థ స్పష్టం చేసింది. దీనిపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది. కాగా, గత కొన్ని వార్గాలుగా అనేక విమానాల్లో భద్రతా పరమైన సమస్యలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story