- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Viral Video: పోలీస్ అధికారి సమయస్పూర్తికి హ్యట్సాఫ్
దిశ, డైనమిక్ బ్యూరో: గంగానదిలోకి దూకబోతున్న వ్యక్తిని ఓ పోలీస్ అధికారి సమయస్పూర్తితో కాపాడిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో ఆ పోలీస్ అధికారిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్‌పూర్ లో జరిగిన ఘటన ప్రకారం ఓ వ్యక్తి ఇంట్లో గొడవ పడి ఆత్మహత్య చేసుకునేందుకు గంగానది వద్దకు వచ్చాడు. నదిపై ఉన్న బ్రిడ్జి పైకి ఆత్మహత్య చేసుకుంటానని తన తండ్రిని బెదిరిస్తున్నాడు. దయచేసి వంతెన దిగిరావాలని ఆ తండ్రి యువకుడిని వేడుకుంటున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇందులో ఓ పోలీస్ అధికారి ఆత్మహత్య చేసుకుంటున్న యువకుడిని మాటల్లో పెట్టగా.. మరో పోలీస్ అధికారి వెనుక నుంచి వచ్చి ఆ యువకుడిని పట్టుకొని వంతెన గోడ మీద నుంచి కిందికి దింపి కాపాడాడు. ఈ సంఘటనను ఓ వ్యక్తి చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో చాకచక్యంగా వ్యవహరించి ఆ వ్యక్తిని కాపాడిన పోలీస్ సమయస్పూర్తిని అందరూ మెచ్చుకుంటున్నారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఆపద సమయంలో తెలివిగా వ్యవరించాడని, నిజంగా గ్రేట్ అంటూ పోలీస్ కు సెల్యూట్ చేస్తున్నారు.