కాంగ్రెస్ లో చేరనున్న వినేష్?

by M.Rajitha |
కాంగ్రెస్ లో చేరనున్న వినేష్?
X

దిశ, వెబ్ డెస్క్ : భారత స్టార్ రెజ్లర్, ఒలంపిక్ క్రీడాకారిణి వినేష్ ఫొగాట్ కాంగ్రెస్ పార్టీలో చేరనుందా.? అవుననే అనిపిస్తోంది. వినేష్ రెజ్లింగ్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తన భవిష్యత్తు ఎందులో అనేది పలువురు పలు ఊహాగానాలు చేశారు. కాని వినేష్ రాజకీయాల్లోకి వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. శుక్రవారం వినేష్ హర్యానా మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత భూపేందర్ సింగ్ హుడాను తన నివాసానికి వెళ్ళి కలిశారు. కాగా హర్యానా ఎన్నికల్లో వినేష్ బీజేపీలో చేరిన తన సోదరీ బబిత ఫొగాట్ మీద పోటీ చేస్తుండవచ్చు అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుండగా.. ఈ సంఘటన హర్యానా రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇది వినేష్ ఒలంపిక్ లో చూపిన పోరాట పటిమను మెచ్చుకునేందుకు మాత్రమే జరిగిన మర్యాద పూర్వక సమావేశం భూపేందర్ సింగ్ తనయుడు, రోహ్తక్ ఎంపీ దీపేందర్ సింగ్ హుడా ట్వీట్ చేశాడు.

Next Story

Most Viewed