When plane is hit by a bird : ఆకాశంలో వెళ్తున్న పక్షులను విమానం ఢీకొడితే ఏం జరుగుతుంది?

by Javid Pasha |   ( Updated:2024-09-22 14:55:37.0  )
When plane is hit by a bird : ఆకాశంలో వెళ్తున్న పక్షులను విమానం ఢీకొడితే ఏం జరుగుతుంది?
X

దిశ, ఫీచర్స్: మీకెప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? ఆకాశంలో విమానం వెళ్తూ ఉండగా సడెన్‌గా పక్షి ఎదురైతే.. అప్పుడు అవి రెండూ ఢీ కొట్టుకుంటే ఏం జరుగుతుంది? అని. చిన్న ప్రాణి కాబట్టి పక్షి వెంటనే చనిపోతుంది. విమానం సేఫ్‌గా ఉంటుందని కొందరు అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. పక్షి వచ్చి విమానాన్ని ఢీ కొట్టినా, విమానం వెళ్లి పక్షిని ఢీ కొట్టినా ప్రమాదం మాత్రం విమానానికే అంటున్నారు ఏవియేషన్ నిపుణులు. అసలేం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.

* పక్షులు గుంపులుగా వచ్చినా, సింగిల్ వచ్చి ఢీకొన్నా విమనాం కూలిపోయే ప్రమాదం లేకపోలేదు. అందుకే వాటిని పక్షులకంటే ఎత్తైన ఆకాశ మార్గంలో నడుపుతుంటారు. అనుకోకుండా తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు ఒకవేళ ఏదైనా పక్షి వచ్చి ఢీకొడితే ఆ పరిస్థితి పైలట్ సామర్థాన్ని, విమానం ఇంజిన్ సామర్థ్యాన్ని తగ్గిస్తుందట. అలాగే ఫ్యూయల్ ట్యాంకును పక్షులు ఢీకొన్నా లీక్ అవడం, మంటలు చెలరేగడం వంటివి జరుగుతాయి.

* విమానం ఇంజిన్ భాగాన్ని పక్షులు తాకితే దానిలోపల ఉన్న బ్లేడ్లు, అలాగే ఫ్లైట్ ఎలక్ట్రానిక్ సిస్టం దెబ్బతింటాయి. ఈ పరిస్థితి విమానం ఎగిరే సామర్థ్యాన్ని వెంటనే తగ్గించడంవల్ల కుప్పకూలవచ్చు. అందుకే ఈ మధ్య పక్షులు ఢీకొట్టినా ఏమీ కాకుండా విమానాలను బలంగా నిర్మిస్తున్నారు. అయినా జాగ్రత్త అవసరం అంటున్నారు నిపుణులు.

* పక్షులు ఫ్లైట్‌ను గానీ, ఫ్లైట్ పక్షులను గానీ తాకినప్పుడు విమానం ఇంజిన్‌లో ఏదైనా చిన్న సమస్య ఉన్నా.. అది మరింత పెరిగిపోయి పెద్దది అవుతుంది. ఫ్యూయల్ ట్యాంక్‌ను లేదా దాని పైపును పక్షి తాకితే విమానంలోని ఇంధనం వెంటనే బయటకు వస్తుంది. ఆ సమయంలో ఎండగా ఉన్నా, వాతావరణం కాస్త వేడిగా ఉన్నా వెంటనే మంటలు చెలరేగుతాయి. విమానం కాలిపోయి అందులోని ప్రయాణికుల ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది.

*నోట్: పైవార్త ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed