మళ్లీ పడిపోయిన బిడెన్.. ఎయిర్ ఫోర్స్ అకాడమీ వేడుకల్లో ఘటన

by Vinod kumar |
మళ్లీ పడిపోయిన బిడెన్.. ఎయిర్ ఫోర్స్ అకాడమీ వేడుకల్లో ఘటన
X

కొలరాడో: అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మళ్లీ కింద పడిపోయారు. కొలరాడోలోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేట్లకు అవార్డులు ప్రధానం చేసే కార్యక్రమాల్లో ఆయన శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగం చేసి, ఓ క్యాడెట్‌తో కరచాలనం చేసిన తర్వాత తన సీటు వద్దకు వెళ్తుండగా ఆయన కార్పెట్ పై బోల్తా పడ్డారు. అయితే.. వైమానిక దళ సిబ్బంది ఆయనను పైకి లేపినప్పుడు.. తన కాలికి తగిలిన నల్లటి సంచిని చూపించారు. 80 ఏళ్ల బిడెన్ కు ఎలాంటి గాయం కాలేదు. వేదికపై ఉన్న చిన్న ఇసుక సంచి బిడెన్ కాలికి తట్టుగా తాకడం వల్లే పడిపోయారని వైట్ హౌస్ అధికారి బెన్ లాబోల్డ్ చెప్పారు.

ఆ ఘటన గురించి విలేకరుల సమావేశంలో బిడెన్ ‘నన్ను ఇసుక కొట్టింది’ అని చమత్కరించారు. ఎయిర్ ఫోన్స్ వన్, మెరైన్ వన్ ద్వారా వైట్ హౌస్ కు వచ్చిన తర్వాత బిడెన్ ను మరోసారి దురదృష్టం వెంటాడింది. హెలికాప్టర్ నుంచి దిగేటప్పుడు దాని తలుపునకు ఆయన తల గట్టిగా తగిలింది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన అత్యంత వృద్ధుడు బిడెన్ 2024లోనూ పోటీ చేయాలనుకుంటున్నారు. ఆయన శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నారని, రోజూ వ్యాయామం చేస్తారని వైట్ హౌస్ వైద్యులు చెప్పారు. 2020లో డొనాల్డ్ ట్రంప్ పై విజయం సాధించిన కొద్ది సేపటికే బిడెన్ తన పెంపుడు కుక్కతో ఆడుతూ కాలు విరగ్గొట్టుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed