అసెంబ్లీలో పోర్న్ చూసిన బీజేపీ ఎమ్మెల్యే!

by Vinod kumar |
అసెంబ్లీలో పోర్న్ చూసిన బీజేపీ ఎమ్మెల్యే!
X

అగర్తలా: త్రిపురలో అధికార పార్టీ ఎమ్మెల్యే జాదబ్ లాల్నాథ్ అసెంబ్లీలో చేసిన పని తీవ్ర విమర్శలకు దారి తీసింది. సమావేశాలు జరుగుతున్న క్రమంలో తన సెల్ ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూస్తున్నట్లుగా ఆరోపిస్తున్న వీడియో కాస్తా వైరల్‌గా మారింది. దీంతో ప్రతిపక్ష నేతలు ఆయనపై విమర్శలకు దిగారు. రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించిన అంశాలపై అసెంబ్లీలో చర్చ జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్పీకర్‌తో పాటు ఇతర ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నప్పుడు జాదబ్ వీడియోలు చూస్తున్నట్లుగా ఉంది.

ఇది కాస్తా వెనకాల ఉన్న వ్యక్తి వీడియో తీయడంతో వైరల్‌గా మారింది. మరోవైపు ఈ ఘటనలో బీజేపీ ఎమ్మెల్యే వైఖరిపై అధిష్టానం ఆగ్రహాం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే జాదబ్ మాత్రం దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు. గతంలోను కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో ఇద్దరు మంత్రులు పోర్న్ వీడియోలు చూస్తుండగా పట్టుబడగా, వారిపై వేటు వేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story