Uttar Pradesh : నోయిడాలో రేవ్ పార్టీ.. 39 మంది యూనివర్సిటీ విద్యార్థులు అరెస్ట్

by Maddikunta Saikiran |
Uttar Pradesh : నోయిడాలో రేవ్ పార్టీ.. 39 మంది యూనివర్సిటీ విద్యార్థులు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఒక రేవ్ పార్టీని భగ్నం చేశారు UP పోలీసులు. నోయిడాలోని ఒక ఫ్లాట్‌లో ‘రేవ్ పార్టీ’ జరుగుతుందని సమాచారం తెలుసుకున్న పోలీసులు రేవ్ పార్టీపై దాడి చేశారు . ఈ దాడిలో మొత్తం 39 మంది విశ్వవిద్యాలయ విద్యార్థులను , కొంతమంది మైనర్‌లను అదుపులోకి తీసుకున్నట్లు శనివారం ఒక పోలీస్ అధికారి తెలిపారు.నోయిడాలోని సెక్టార్-39లో సూపర్‌నోవా రెసిడెన్షియల్ సొసైటీలో 'రేవ్ పార్టీ' గురించి శుక్రవారం రాత్రి సమాచారం అందిందని, ఒక పోలీస్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ప్రముఖ విశ్వవిద్యాలయానికి చెందిన 39 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు, రేవ్ పార్టీలో పాల్గొన్న విద్యార్థుల వయస్సు 16 నుంచి 20 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు.

కాగా.. ఈ రేవ్ పార్టీ నుండి పెద్ద సంఖ్యలో హర్యానా లేబుల్ మద్యం సీసాలను, హుక్కాలను , ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో.. ఈ పార్టీలో పాల్గొనే వారికోసం వాట్సాప్‌లో ఒక గ్రూప్ ఏర్పాటు చేసి అందులో ఈ పార్టీ కోసం విద్యార్థులను ఆహ్వానించినట్లు తేలింది. నిర్వాహకులు ఈ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు ఒకరికి రూ. 500 , అదే జంటకు అయితే రూ. 800 గా నిర్ణయించారని, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Next Story