UP: ప్రియుడ్ని కొట్టి బలవంతంగా విషం తాగించిన మహిళ

by Shamantha N |
UP: ప్రియుడ్ని కొట్టి బలవంతంగా విషం తాగించిన మహిళ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఓ మహిళ ప్రియుడిని కొట్టి బలవంతంగా విషయం తాగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో ఈ ఘటన జరిగగా.. ఆ వ్యక్తి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. హమీర్‌పూర్‌కు చెందిన శైలేంద్ర గుప్తా మహోబాలోని ప్రైవేట్ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. నాలుగేళ్ల కిందట కాలిపహరి గ్రామానికి చెందిన ఒక మహిళతో అతడికి పరిచయం ఏర్పడింది. దీంతో ఈ జంట ఒకే ఇంట్లో కలిసి నివసించారు. కొంతకాలం వారిద్దరూ సహజీవనం చేశారు. ఆ సమయంలో విలువైన నగలు, నాలుగు లక్షల నగదు అతడు తన ప్రియురాలికి ఇచ్చాడు. కాగా, కొంతకాలం క్రితం ఆ మహిళకు మరో వ్యక్తి పరిచయమయ్యాడు. దీంతో శైలేంద్రకు ఆమె దూరంగా ఉండటంతో వారిద్దరూ విడిపోయారు. ఈ నేపథ్యంలో తాను ఇచ్చిన నగలు, డబ్బు తిరిగి ఇవ్వాలని శైలేంద్ర ఆమెను డిమాండ్‌ చేశాడు. దీని కోసం ఆ మహిళ నివసించే ఇంటికి వెళ్లాడు. ఈ సందర్భంగా ప్రియురాలు, తన సహచరులతో కలిసి అతడ్ని కొట్టింది. అలాగే బలవంతంగా విషం తాగించింది.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శైలేంద్ర

కాగా.. శైలేంద్రను జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. డబ్బు, నగలు గురించి మరోసారి అడిగితే తప్పుడు కేసులో ఇరికిస్తామని ఆ మహిళ, ఆమె ఫ్రెండ్స్‌ తనను బెదిరించినట్లు శైలేంద్ర ఆరోపించాడని పోలీస్ అధికారి తెలిపారు. నిందితులను ముగ్గురు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.

Next Story

Most Viewed