ప్రెస్ మీట్‌లో కేంద్ర మంత్రి కుమారస్వామి ముక్కు నుంచి రక్తం.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు

by Mahesh |   ( Updated:2024-08-03 12:43:39.0  )
ప్రెస్ మీట్‌లో కేంద్ర మంత్రి కుమారస్వామి ముక్కు నుంచి రక్తం.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి కుమారస్వామి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం బెంగళూరులో విలేకరుల సమావేశానికి హాజరైన అతను మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా ముక్కు నుంచి రక్తం కారడం మొదలైంది. దీంతో ఆయన వెంటనే తన చేతితో రక్త ప్రవాహాన్ని అదిమి పట్టుకుని వెనక్కి జరిగారు. అనంతరం ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రస్తుతం ఆయన బెంగళూరులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే కేంద్ర మంత్రి కుమారస్వామి ఆరోగ్యానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed