కేంద్ర పర్యాటక మంత్రి స్కై డైవింగ్‌ సాహసం.. వీడియో వైరల్‌

by Ramesh N |
కేంద్ర పర్యాటక మంత్రి స్కై డైవింగ్‌ సాహసం.. వీడియో వైరల్‌
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ గ్రేట్ అడ్వేంచర్ ఫీట్ చేశారు. ప్రపంచ స్కై డైవింగ్‌ డే సందర్భంగా హర్యానాలోని నార్నాల్‌లో శనివారం గగనతలంలో వేగంగా వెళ్తున్న విమానంలో నుంచి ఆయన పారాచూట్‌తో కిందకి డైవ్ చేశారు. అయితే, ఒక నిపుణుడి సాయంతో మంత్రి ఈ సాహసంలో పాల్గొన్నారు. విమానం నుంచి వారు కిందికి దూకిన కొద్ది క్షణాలకు పారాచ్యూట్ తెరుచుకుంది.

ఆ తర్వాత ఆకాశంలోని మేఘాల మీద తేలియాడుతూ.. భూమిపైకి వారు సేఫ్ ల్యాండ్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. లేటు వయసులో ఉండి ఇలాంటి సాహసం చేయడం గ్రేట్ అంటూ నెటిజన్లు మంత్రిని అభినందిస్తున్నారు. స్కై డైవింగ్ టూరిజానికి మంత్రి సాహసం బూస్టింగ్ లాంటిదని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

Next Story