Union Budget 2024: బిహార్ కు వరాల జల్లు

by Shamantha N |   ( Updated:2024-07-23 06:41:12.0  )
Union Budget 2024: బిహార్ కు వరాల జల్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: బహుపాక్షిక అభివృద్ధి ఏజెన్సీల నిధుల ద్వారా బిహార్‌కు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. బిహార్‌లో జాతీయ రహదారుల నిర్మాణం, పునరుద్ధరణకు రూ.26వేల కోట్లు కేటాయించింది. అమృత్‌సర్-కోల్‌కతా పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా బీహార్‌లోని గయా వద్ద పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడతాము. ఇది తూర్పు ప్రాంత అభివృద్ధికి ఊతమిస్తుంది. రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టుల అభివృద్ధికి కూడా మద్దతు తెలిపింది. పాట్నా - పూర్నియా ఎక్స్‌ప్రెస్‌వే, బక్సర్-భగల్పూర్ హైవే, బుద్ధగయ- రాజ్‌గిర్-వైశాలి-దర్భంగా, బక్సర్ లోని గంగానదిపై రెండు లైన్ల వంతెన నిర్మాణానికి నిధులు కేటాయించింది. బిహార్ లో వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. అందుకోసం ప్రత్యేకంగా రూ.11,500 కోట్ల నిధులు కేటాయించింది.

రూ. 21,400 కోట్లతో పవర్ ప్లాంట్ ఏర్పాటు

బిహార్ లో రూ.21.4 వేల కోట్ల వ్యయంతో 2400 మెగావాట్ల కొత్తపవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. బిహార్ లోని పిర్ పైంటిలో పవర్ ప్లాంట్ ఏర్పాటు జరగనుంది. బిహార్‌లో కొత్త విమానాశ్రయాలు, వైద్య కళాశాలలు, క్రీడా మౌలిక సదుపాయాలకు అందిస్తామంది. అభివృద్ధి కోసం బ్యాంకుల నుంచి సాయం తీసుకుంటామని బిహార్ చేసిన అభ్యర్థలను వేగవంతం చేస్తామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed