Union Budget-2024: స్థిరాస్తి అమ్మకందారులకు షాకిచ్చిన నిర్మలమ్మ.. ఇకపై అలా చేయాల్సిందే

by Shiva |   ( Updated:2024-07-23 17:20:39.0  )
Union Budget-2024: స్థిరాస్తి అమ్మకందారులకు షాకిచ్చిన నిర్మలమ్మ.. ఇకపై అలా చేయాల్సిందే
X

దిశ, వెబ్‌డెస్క్: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ మేరకు స్థిరాస్తి అమ్మకందారులకు ఓ రంకంగా బిగ్ షాకే ఇచ్చారు. ఇప్పటి వరకు ప్రాపర్టీ సేల్పై ఇన్నాళ్లూ ఉన్న ఇండెక్సేషన్ బెన్ఫిట్స్ను రద్దు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఇక నుంచి 15 ఏళ్లు దాటిన స్థిరాస్తి అమ్మినట్లు అయితే వచ్చిన లాభంలో 12.5 శాతం పన్ను ప్రభుత్వానికి చేల్లించాలని పేర్కొన్నారు. కేంద్రం స్పష్టం చేసింది. ఈ పరిణామంతో రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఒక్కసారిగా కుదేలయ్యాయి. ఏకంగా డీఎల్ఎఫ్ స్టాక్ 6 శాతానికి పడిపోయింది. గోద్రేజ్ ప్రాపర్టీస్ స్టాక్ 5 శాతం, ప్రెస్టేజ్ ఎస్టేట్ 5.3 శాతం, ఫీనిక్స్ మిల్స్ షేర్ 2.1 శాతం పడిపోయాయి. అయితే, ఇంతకు మందు స్థిరాస్తి అమ్మకాలపై కేపిటల్ గెయిన్స్పై ఇండెక్సేషన్ బెన్ఫిట్స్తో కూడిన 10 శాతం పన్ను ఉండేది. ఇక నుంచి స్థిరాస్తి అమ్మగా వచ్చిన లాభాలపై పన్ను కట్టాలంటూ కేంద్రం అందరికీ షాక్ ఇచ్చింది.

Read More..

Union Budget 2024:యువతకు గుడ్ న్యూస్..కేంద్ర ఆర్థిక మంత్రి కీలక ప్రకటన

Advertisement

Next Story

Most Viewed