- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎర్ర సముద్ర సంక్షోభం ఉన్నా భారత వృద్ధికి ఢోకా లేదు: ఆర్థిక సమీక్ష

దిశ, బిజినెస్ బ్యూరో: ఎర్ర సముద్ర సంక్షోభం కారణంగా ఉద్భవించే భౌగోళిక రాజకీయ పరిణామాలతో ప్రపంచ ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిపై ప్రభావితం ఉండనుంది. అయినప్పటికీ భారత ఆర్థికవ్యవస్థ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధిని సాధించగలదని అంచనా. సోమవారం నాటి ప్రభుత్వ ఆర్థిక సమీక్షలో ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ టీమ్, దేశీయ డిమాండ్ స్థిరంగా ఉండటం, ప్రైవేట్ పెట్టుబడుల మద్దతుతో ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే 2024-25లో భారత వృద్ధి ప్రపంచ వృద్ధిని అధిగమిస్తుందన్నారు. ఎర్ర సముద్రంలో హౌతీల దాడులు ప్రపంచ సరఫరాపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. ఇది గతేడాది నెమ్మదించిన ప్రపంచ వృద్ధిపై మరింత ఒత్తిడిని కలిగించగలదు. 2024లోనూ సరఫరా అంతరాయాలు కొనసాగినప్పటికీ భారత అభివృద్ధికి ఎలాంటి అవాంతరాలు ఉండవని ఆర్థిక సమీక్షలో అనంత నాగేశ్వరన్ చెప్పారు. భారత ఆర్థిక రంగానికి ఉన్న బలం, ఇటీవల భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్మాణాత్మక సంస్కరణలు రానున్న సంవత్సరాల్లో భారత వృద్ధిని అత్యుత్తమంగానే కొనసాగించేలా చూడగలదన్నారు. ఇదే సమయంలో సీపీఐ ద్రవ్యోల్బణాన్ని క్రమంగా తగ్గించేందుకు అవసరమైన చర్యలను చేపడతామని ఆర్థిక సమీక్ష పేర్కొంది.