- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కర్ణాటక ఓటర్లకు బీజేపీ హామీల వర్షం.. అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్లు ఫ్రీ
బెంగళూరు: కర్ణాటక ఎన్నికల కోసం తయారు చేసిన మ్యానిఫెస్టో ప్రజా ప్రణాళికెను బీజేపీ సోమవారం విడుదల చేసింది. యూనిఫాం సివిల్ కోడ్ అమలు, తయారీ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు వంటి వాగ్ధానాలు ఈ మ్యానిఫెస్టోలో ప్రధానమైనవి. బీజేపీ మ్యానిఫెస్టోను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం బెంగళూరులో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, పార్టీ సీనియర్ నాయకుడు బిఎస్ యడియూరప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా నడ్డా మీడియాతో మాట్లాడుతూ.. మ్యానిఫెస్టోని ఎయిర్ కండిషన్డ్ రూమ్‌లో తయారు చేయలేదన్నారు. పార్టీ కార్యకర్తలు అన్ని ప్రాంతాలను సందర్శించి ఇచ్చిన సమాచారంతో దీన్ని తయారు చేశామని చెప్పారు.
రాష్ట్రంలో తమ పార్టీ అందరికీ సమ న్యాయం చేస్తుందని.. ఎవ్వరినీ బుజ్జగించదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను మాత్రమే రద్దు చేసిందన్నారు. ఇది ప్రతిపక్షాలకు ఓ ఆయుధంలా మారింది. తాము అధికారంలోకి వస్తే వాటిని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్, జేడీ (ఎస్) హామీ ఇస్తున్నాయి. రాష్ట్రంలో ఈసారి గట్టి పోటీ ఎదుర్కొంటున్న కాషాయ పార్టీ.. తమ వాగ్ధానాలు సమాజంలోని ప్రతి వర్గాన్ని తాకుతాయని చెప్పింది.
పౌరుల జాతీయ రిజిస్టర్‌ను ప్రవేశపెడతామని, అక్రమ వలసదారులందరినీ త్వరలోనే బహిష్కరిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు నెలవారీ రేషన్ కిట్‌లు, షెడ్యూల్డ్ కులాలు, తెగల మహిళలకు ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం, కర్ణాటకను ఎలక్రిక్ వాహనాల హబ్‌గా అభివృద్ధి చేసే ప్రణాళిక వంటి అనేక వాగ్ధానాలను బీజేపీ చేసింది. అంతేకాదు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఏడాదికి ఉగాది, గణేష్ చతుర్ధి, దీపావళి పండగల సందర్భాల్లో ఉచితంగా వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చింది.