బీజేపీ వైఖరితో నిరుద్యోగుల ఆందోళన..కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ

by vinod kumar |
బీజేపీ వైఖరితో నిరుద్యోగుల ఆందోళన..కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ విద్యా వ్యతిరేక మనస్తత్వం కారణంగా నిరుద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. ఉపాధి లేకపోవడం వల్ల దేశంలోని యువత పూర్తి నిరుత్సాహంతో ఉన్నారని తెలిపారు. 2024లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు తగ్గుముఖం పట్టాయని వెలువడిన ఓ మీడియా కథనాన్ని ఉద్దేశిస్తూ రాహుల్ బుధవారం మాట్లాడారు. ‘దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటీలు ఆర్థిక మందగమనం దుష్ప్రభావాలు సంస్థలు ఎదుర్కొంటున్నాయి. ఐఐటీల్లో ప్లేస్‌మెంట్‌లు నిరంతరం పడిపోవడం, వార్షిక ప్యాకేజీలో తగ్గుదల నిరుద్యోగం గరిష్ట స్థాయిని ఎదుర్కొంటున్న యువత పరిస్థితిని మరింత దెబ్బతీస్తున్నాయి’ అని తెలిపారు.

2022లో 19శాతం మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్ పొందలేకపోయారని, అదే రేటు ఈ ఏడాది 38శాతానికి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని అత్యంత సమర్థవంతమైన ఇన్‌స్టిట్యూట్లలోనే పరిస్థితి ఇలా ఉంటే..మిగిలిన సంస్థల్లో ఇంకెలా ఉందో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. కష్టపడి పనిచేసే యువతను ఈ సంక్షోభం నుంచి విముక్తి చేయడానికి మోడీ ప్రభుత్వం దగ్గర ప్రణాళిక ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. యువతకు నిరంతరం అండగా ఉంటామని, వారి తరఫున పోరాడతామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story