ఆగని కొవిడ్ వ్యాప్తి: 4,423కు చేరిన యాక్టిక్ కేసులు

by samatah |
ఆగని కొవిడ్ వ్యాప్తి: 4,423కు చేరిన యాక్టిక్ కేసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో కొవిడ్ వ్యాప్తి ఆగడం లేదు. గత 24గంటల్లో 760 మంది వైరస్ బారిన పడినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4,423కు చేరింది. తాజాగా వైరస్‌తో కర్ణాటకలో ఒకరు, కేరళలో మరొకరు మరణించారు. రికవరీ రేటు 98.81 శాతంగా ఉన్నట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లు ఇచ్చినట్టు తెలిపింది.

Advertisement

Next Story