ఉమేష్ పాల్ మర్డర్ కేసు : యూపీలో మరో నిందితుడి ఎన్ కౌంటర్

by Sathputhe Rajesh |
ఉమేష్ పాల్ మర్డర్ కేసు : యూపీలో మరో నిందితుడి ఎన్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: యూపీలో సంచలనం సృష్టించిన ఉమేష్ పాల్ హత్య కేసు నిందితుడిని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఉమేష్ పాల్‌పై మొదట కాల్పులకు తెగబడ్డ ఉస్మాన్‌ను పోలీసులు మట్టుబెట్టారు. యూపీలో బీఎస్పీకి చెందిన రాజ్ పాల్ అనే నేతను 2005లో హత్యచేశారు. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ ను ఆరుగురు వ్యక్తులు ఇటీవల నడిరోడ్డుపై కాల్పులు జరిపి చంపేశారు. ఈ ఘటను సీరియస్ గా తీసుకున్న సీఎ యోగి ఆదిత్యనాథ్ నిందితులను వదలబోమని హెచ్చరించారు.

కేసులో నిందితుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు సోమవారం తెల్లవారుజామున ప్రయాగ్ రాజ్ లోని కౌంధియారా పోలీస్ స్టేషన్ నిందితుడు విజయ్ అలియాస్ ఉస్మాన్ ను ఎన్ కౌంటర్ లో కాల్చి చంపినట్లు వెల్లడించారు. ఉమేష్ పాల్ పై కాల్పులు జరిపిన వారిలో ఉస్మాన్ మొదటి వ్యక్తి అని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరో నిందితుడు అర్బాజ్ ను ఫిబ్రవరి 27న పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే.

అతడు పారిపోవాడానికి యత్నించగా పోలీసులు ఆయనపై కాల్పులు జరిపారు. కాగా యూపీలో 2004లో అలహాబాద్ అసెంబ్లీ స్థానం బై ఎలక్షన్స్‌లో రాజ్ పాల్ బీఎస్పీ తరపును పోటీచేసి విజయం సాధించారు. ప్రత్యర్థిగా ఉన్న అతీక్ అహ్మద్ (సమాజ్ వాదీ పార్టీ) తమ్ముడు ఖలీద్ అజీమ్ ఓటమి చెందారు. ఈ కేసులో ఉమేష్ సాక్షిగా ఉండగా ఇటీవల హత్యకు గురయ్యాడు. ఉమేష్ భార్య జయపాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed