Ukraine Crisis: రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్

by Shamantha N |
Ukraine Crisis: రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా- ఉక్రెయిన్‌ (Russia-Ukraine) మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. రష్యా రాజధాని మాస్కో(Moscow)ను లక్ష్యంగా ఉక్రెయిన్ డ్రోన్ దాడికి పాల్పడింది. ఉక్రెయిన్‌ 17 డ్రోన్ల(Drone Attack)ను ప్రయోగించినట్లుగా రష్యా అధికారులు పేర్కొన్నారు. రామెన్‌స్కోయ్, కొలోమెన్‌స్కీ జిల్లాలతో పాటు మాస్కోకు నైరుతి దిశలో ఉన్న డొమోడెడోవో నగరంలో 12 డ్రోన్లను ధ్వంసం చేశామని మేయర్ సెర్గీ సోబ్యానిన్ తెలిపారు. "ప్రాథమిక సమాచారం ప్రకారం, శిధిలాలు పడిపోయిన ప్రదేశంలో ఎలాంటి ఆస్తి నష్టం లేదా ప్రాణనష్టం లేదు" అని సోబ్యానిన్ టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌లో తెలిపారు. ఆ ప్రాంతంలో అత్యవసర సేవలు కొనసాగిస్తున్నామన్నారు.

రెండు ఎయిర్ పోర్టులు మూసివేత

ఇకపోతే, ఉక్రెయిన్ డ్రోన్‌(Ukraine Crisis) దాడుల కారణంగా మాస్కోలోని డొమోడెడోవో, జుకోవో విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. ఈ దాడుల కారణంగా ప్రాణ నష్టం జరగలేదని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. మరోవైపు, క్రెమ్లిన్‌కు ఆగ్నేయంగా 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామెన్‌స్కోయ్ లక్ష్యంగా సెప్టెంబర్ లో ఉక్రెయిన్ అతిపెద్ద దాడి చేసింది. కాగా.. రష్యా వైమానిక రక్షణ విభాగాలు ఉక్రెయిన్ కు చెందిన 20 డ్రోన్‌లను ధ్వంసం చేశాయి.

Advertisement

Next Story