Uddhav Thackeray: సీఎం కావాలనే ఆశలేదు..శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే

by vinod kumar |
Uddhav Thackeray: సీఎం కావాలనే ఆశలేదు..శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర సీఎంగా మరోసారి తిరిగి రావాలని కలలు కనడం లేదని శివసేన(యూబీటీ) చీఫ్, మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే స్పష్టం చేశారు. అత్యున్నత పదవిని చేపట్టాలని ఆశించడంలేదని, ఆ ప్రకటనకు కట్టుబడి కొనసాగుతున్నానని తెలిపారు. అహ్మద్‌నగర్‌లోని కోపర్‌గావ్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రావడంపైనే కాకుండా ప్రజలకు సేవ చేయడంపైనే ఎక్కువ దృష్టి సారించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం షిండేపై విమర్శలు గుప్పించారు. రాజకీయ జన్మనిచ్చిన వారికే ద్రోహం చేసిన వారు ప్రజలను మోసం చేయలేరా అని ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వంతో ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని విమర్శించారు. అయితే ఉద్ధవ్ ప్రకటనపై షిండే వర్గం నేత, రాష్ట్ర మంత్రి శంభురాజే దేశాయ్ స్పందించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఉద్థవ్ పార్టీ బలం తగ్గిందని, ఆయన పార్టీ బలహీనపడిందని తెలిపారు. అందుకే సంతృప్తి చెందాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీతో పొత్తు పెట్టుకోవడం తప్ప ఆయనకు మరో మార్గం లేదని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed