శివసేన సంక్షోభం.. బీజేపీపై భారీ ఆరోపణ చేసిన ఉద్ధవ్ థాకరే

by Mahesh |   ( Updated:2023-02-20 06:36:17.0  )
శివసేన సంక్షోభం.. బీజేపీపై భారీ ఆరోపణ చేసిన ఉద్ధవ్ థాకరే
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో ప్రస్తుతం రాజకీయం తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఉద్ధవ్ థాకరే, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటివల షిండే వర్గానికే శివసేన పార్టీ, దాని గుర్తు వర్తిస్తుందని ఈసీ నిర్ణయించింది. దీంట్లో బీజేపీ పాత్ర ఉందని ఉద్ధవ్ వర్గం ఆరోపణలు చేసింది. ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. పూణెలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన షిండే ప్రభుత్వంపై ప్రసంశలు కురిపించారు.

అలాగే ఉద్ధవ్ థాకరే.. బీజేపీ మద్దతో.. 40 కు పైగా స్థానాల్లో గెలిచి.. అక్రమంగా.. కాంగ్రెస్‌తో పొత్తు పెత్తుకుని అధికారంలోకి వచ్చారని విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన ఉద్ధవ్ థాకరే.. బీజేపీ పై తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీతో పొత్తు తెగతెంపులు చేసుకోవాలని బీజేపీనే తనపై ఒత్తిడి తెచ్చిందని ఉద్ధవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ప్రస్తుతం మహారాష్ట్రలో రాజకీయం రంజు మీద ఉంది.

Also Read..

థాక్రే.. శరద్ పవార్‌కు లొంగిపోయారు : అమిత్ షా

Advertisement

Next Story

Most Viewed