డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్.. రేపే ప్రమాణస్వీకారం

by Gantepaka Srikanth |
డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్.. రేపే ప్రమాణస్వీకారం
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర కేబినెట్‌(Tamil Nadu Cabinet)లో అనూహ్య మార్పులు చేశారు. డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్(Udayanidhi Stalin) పేరును ఇప్పటికే ప్రకటించగా.. ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని శనివారం సీఎం ఎంకే స్టాలిన్(CM MK Stalin) అధికారికంగా ప్రకటించారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నై చేపాక్కం-తిరువల్లికేణి నియోజకవర్గంలో పోటీ చేసిన ఉదయనిధి స్టాలిన్ గత ఎన్నికల్లో విజయం సాధించి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ తనకు అప్పగించిన మంత్రిత్వశాఖకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ చాలా యాక్టివ్‌గా కొనసాగుతున్నారు. దీంతో డిప్యూటీ సీఎంగా అవకాశం ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed