Udayanidhi Stalin: సనాతన ధర్మంపై నా వ్యాఖ్యలను వక్రీకరించారు.. ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-10-22 07:22:24.0  )
Udayanidhi Stalin: సనాతన ధర్మంపై నా వ్యాఖ్యలను వక్రీకరించారు.. ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సనాతన ధర్మం (Sanathana Dharma)పై ఇటీవల తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ (Deputy CM Udayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా సోషల్ మీడియా (Social Media)లో ఆయనకు వ్యతిరేకంగా హిందూ అనుబంధ సంఘాలు ఓ క్యాంపెయిన్‌ను కూడా రన్ చేశాయి. అదేవిధంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ఒక్కోక్కరు ఒక్కో విధంగా స్పందించారు. మరోవైపు కొందరు ఉదయనిధికి బసటగా నిలిచారు.

అయితే, తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ (Deputy CM Udayanidhi Stalin) మరోసారి స్పందించారు. కావాలనే కొందరు సనాతన ధర్మం (Sanathana Dharma)పై తన వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపారు. దేశ వ్యాప్తంగా తనపై చాలామంది ఫిర్యాదు చేశారని.. క్షమాపణలు కూడా చెప్పాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. ఆ విషయంలో ఎవరికీ క్షమాపణ చెప్పేది లేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలపై న్యాయ పోరాటానికి కూడా సిద్ధమని ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) స్పష్టం చేశారు.

కాగా, చెన్నై (Chennai)లోని తేనాంపేట (Tenampet)లో ‘తమిళనాడు ప్రొగ్రెసివ్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ నిర్వహించిన ‘సనాతన ఒళిప్పు మానాడు’ (సనాతన ధర్మ నిర్మూలన) అనే సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సనాతన ధర్మం అనేది మలేరియా, డెంగీ లాంటిదని కామెంట్ చేశారు. ఆ ధర్మాన్ని నిర్మూలించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని విషయాలను కేవలం వ్యతిరేకిస్తే సరిపోదని.. వాటిని పూర్తిగా నిర్మూలించాలని కామెంట్ చేశారు. దోమలు, డెంగీ జ్వరాలు, మలేరియా, కరోనా వంటి వాటిని మనం వ్యతిరేకిస్తే పోవని.. నిర్మూలించాలని, అదేవిధంగా సనాతన ధర్మం పట్ల కూడా వ్యవహరించాలని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed