Typhoon Yagi: టైపూన్ యాగి బీభత్సం.. ఆ మూడు దేశాలకు భారత్ మానవతా సాయం

by vinod kumar |
Typhoon Yagi: టైపూన్ యాగి బీభత్సం.. ఆ మూడు దేశాలకు భారత్ మానవతా సాయం
X

దిశ, నేషనల్ బ్యూరో: అత్యంత శక్తివంతమైన యాగి తుపాన్ కారణంగా మయన్మార్, లావోస్, వియత్నాం దేశాలు తీవ్రంగా ప్రభావిమయ్యాయి. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించగా అనేక మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. దీంతో ఆయా దేశాల ప్రజలను ఆదుకునేందుకు భారత్ అత్యవసర మానవతాసాయం పంపింది. ‘ఆపరేషన్ సద్భవ్’ పేరుతో భారత్ ఈ సాయాన్ని అందజేసింది. యాగీ తుఫాన్‌ వల్ల నష్టపోయిన ప్రజలకు తమ సంఘీభావాన్ని తెలియజేస్తూ భారత్‌ సాయం అందజేస్తోందని విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ తెలిపారు. లావోస్‌కు ప్రత్యేక విమానంలో జనరేటర్ సెట్‌లు, వాటర్ ప్యూరిఫైయర్‌లు, ట్యాబ్లెట్‌లు, క్రిమిసంహారకాలు, పరిశుభ్రత కిట్‌లు, దోమ తెరలు, దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగ్‌లతో సహా 10 టన్నుల సహాయాన్ని పంపినట్టు వెల్లడించారు.

అలాగే భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌక ఐఎన్‌ఎస్ సాత్పురాలో దుస్తులు, మందులతో సహా మరో 10 టన్నుల సహాయాన్ని మయన్మార్‌కు పంపారు. భారత వైమానిక దళానికి చెందిన మరొక విమానంలో వియత్నాంలోని బాధిత కమ్యూనిటీలకు సహాయం చేయడానికి నీటి శుద్ధి వస్తువులు, నీటి కంటైనర్లు, దుప్పట్లు, వంటగది పాత్రలు, సోలార్ లాంతర్‌లతో సహా 35 టన్నుల సహాయాన్ని తీసుకువెళ్లింది. వియత్నాంకు మానవతావాద మద్దతు అందించడం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంతో గుర్తించబడిన రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలకు నిదర్శనమని విదేశీ మంత్రిత్వ శాఖ తెలిపింది.

కాగా, టైపూన్ యాగి వల్ల ఉత్తర లావోస్‌లో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో వ్యవసాయ భూములకు తీవ్ర నష్టం కలిగించాయి. దాదాపు 40,000 మంది ప్రజలను ప్రభావితమయ్యారు. అలాగే వియత్నాంలో 254 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 82 మంది తప్పిపోయారని ఆ దేశ ప్రభు్తం వెల్లడించింది. ఇక కొండచరియలు విరిగిపడటం, చెట్లు కూలిపోవడం, వరదల కారణంగా 800 మందికి పైగా గాయపడ్డారు.188,000 కంటే ఎక్కువ ఇళ్లు ధ్వంసమయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed