J&K: రాజౌరీ జిల్లాలో ఎదురుకాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

by Shamantha N |
J&K: రాజౌరీ జిల్లాలో ఎదురుకాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లోని(Jammu and Kashmir) రాజౌరీ జిల్లాలో(Rajouri distric) ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దు దగ్గర చొరబాటుకు యత్నించిన(infiltration attempt) ముష్కరులను ఆర్మీ(Army) అధికారులు మట్టుబెట్టారు. నౌషెరా సెక్టార్‌లో సోమవారం తెల్లవారుజామున ఈ ఆపరేషన్ జరిగిందని అధికారులు తెలిపారు. భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను(Two terrorists) హతమార్చడంతో పాటు ఏకే-47 రైఫిల్స్ సహా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో నిఘాను పెంచామని వెల్లడించారు.

రాజౌరీ జిల్లాలో ఎన్ కౌంటర్

రాజౌరీ జిల్లాలో ఇటీవలే భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. సెప్టెంబర్ 3న సెర్చ్ ఆపరేషన్ చేపడుతుండగా.. ముష్కరులు ఆర్మీ అధికారులపై కాల్పులు జరిపి అక్కడ్నుంచి పారిపోయారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఆగస్టు చివరి వారంలో రాజౌరిలోని లాఠీ ప్రాంతంలో అనుమానాస్పద ఉగ్రవాద స్థావరాన్ని ఆర్మీ లక్ష్యంగా చేసుకున్నప్పుడు మరో ఎన్‌కౌంటర్ జరిగింది. జూలైలో, అదే జిల్లాలోని గుండా ప్రాంతంలోని భద్రతా పోస్ట్‌పై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఒక జవాన్ గాయపడ్డాడు. ఇకపోతే, జమ్ముకశ్మీర్ లో ఎన్నికల దృష్ట్యా అధికారులు భద్రతను మరింతగా పెంచారు. సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1వ తేదీల్లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 4న ఫలితాలు రానున్నాయి.

Advertisement

Next Story

Most Viewed