జమ్మూలో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-10 06:47:14.0  )
జమ్మూలో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం
X

దిశ, డైనమిక్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లష్కరే తొయీబా ఉగ్రవాదులు హతమయ్యారు. ఇవాళ తెల్లవారుజామున షోపియాన్‌లోని అల్షిపొరా ప్రాంతంలో స్థానిక పోలీసులతో కలిసి భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో ప్రతి దాడిగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయారని జమ్మూ కాశ్మీర్ పోలీసులు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

మృతులను మోరిఫత్ మక్బూల్, జాజిమ్ ఫరూఖ్ అలియాస్ అబ్రార్‌గా గుర్తించారు. ఇరువురు లష్కరే తొయిబా ఉగ్ర సంస్థకు చెందిన వారని పోలీసులు వెల్లడించారు. అయితే కశ్మీరీ పండిట్ సంజయ్ శర్మ హత్యలో ఈ ఉగ్రవాదుల హస్తం ఉందని, పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి నెలలో పుల్వామా జిల్లాలోని అచన్ ప్రాంతంలో బ్యాంక్ సెక్యూరిటీ గార్డు సంజయ్ శర్మను ఉగ్రవాదులు కాల్చి చంపారు. కాగా, ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

Advertisement

Next Story