Maoist attack : మావోయిస్టుల దాడిలో ఇద్దరు జవాన్లకు గాయాలు

by Y. Venkata Narasimha Reddy |
Maoist attack : మావోయిస్టుల దాడిలో ఇద్దరు జవాన్లకు గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా(Sukma District of Chhattisgarh) లోని వీక్లీ మార్కెట్‌లో మావోయిస్టుల దాడి(Maoist attack)లో ఇద్దరు జవాన్ల(two jawans)కు తీవ్ర గాయలయ్యాయి. గాయపడిన జవాన్లు కరాటం దేవా, సోధి కన్నలను జాగర్గుండ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సుక్మా జిల్లా జాగరగుండ వీక్లీ మార్కెట్ లో అదివారం విధులు నిర్వహిస్తున్న ఇద్దరు జవాన్లపై మావోయిస్టు యాక్షన్ టీమ్ కత్తులతో దాడి చేసింది. దాడిలో గాయపడిన జవాన్లకు చెందిన ఆయుధాలను మావోయిస్టులు ఎత్తుకెళ్లారని జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ వెల్లడించారు. మెరుగైన చికిత్స కోసం జవాన్లను ఎయిర్ లిఫ్టు ద్వారా తరలించే ఏర్పాట్లు చేపట్టారు. సంతలో బందోబస్తు విధుల్లో ఉన్న జవాన్లపై ముందస్తు పథకం మేరకే దాడి చేసినట్లుగా పోలీస్ అధికారులు అనుమానిస్తున్నారు. దాడికి పాల్పడిన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చత్తీస్ గడ్ అడవుల్లో మావోయిస్టుల ఏరివేతకు కొన్ని నెలలుగా పోలీసులు, సైన్యం ఆపరేషన్ కగార్ పేరుతో ముమ్మర గాలింపులు, దాడులు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో 200మంది వరకు మావోయిస్టులు చనిపోవడం, వందలాది మంది అరెస్టులు, లొంగిపోవడం జరిగింది. మావోయిస్టులకు, పోలీస్ బలగాలకు మధ్య సాగుతొన్న పోరులో చత్తీస్ గడ్ అడవుల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed