- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుటుంబ రాజకీయాలకు ఇదే నిదర్శనం : ప్రధాని మోడీ
భోపాల్ : మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లోని ఇద్దరు దిగ్గజ నేతలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ధ్వజమెత్తారు. దిగ్విజయ్‌సింగ్, కమల్‌నాథ్‌లు తమ కుమారుల రాజకీయ భవితవ్యం కోసం కొట్లాడుకోవడంలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. ‘‘మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు నా కొడుకుకు దక్కాలంటే.. నా కొడుకుకు దక్కాలంటూ దిగ్విజయ్, కమల్‌నాథ్‌లు హోరాహోరీగా తలపడుతున్నారు. ఎలాగైనా తమ కుమారులను పార్టీలో కీలక స్థానంలో కూర్చోబెట్టాలనే తాపత్రయం వారిద్దరిలో స్పష్టంగా కనిపిస్తోంది’ అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలోని కుటుంబ రాజకీయాలకు ఇంతకుమించిన ఉదాహరణ మరొకటి ఉండదన్నారు.
ఆదివారం మధ్యప్రదేశ్‌లోని సియోనిలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగిస్తూ మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘2014కు ముందు దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పుడల్లా లక్షల కోట్ల కుంభకోణాలు జరిగేవి. ఇప్పుడు బీజేపీ హయాంలో కుంభకోణాల మాటే లేదు. మా ప్రభుత్వం పేదల బాగు కోసం పొదుపు చేసిన డబ్బును ఇప్పుడు పేదల ఉచిత రేషన్ కోసం ఖర్చు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న అతిపెద్ద తేడా ఇదే’’ అని ప్రధాని పేర్కొన్నారు. ‘‘నేను పుట్టి పెరిగింది పేదరికంలోనే. కాబట్టి పేదరికం గురించి ప్రత్యేకంగా పుస్తకాలలో చదువుకోవాల్సిన అవసరం నాకు లేదు. పేదల బాధ నాకు అర్థమవుతుంది. అందుకే ఉచిత రేషన్ స్కీంను మరో 5 సంవత్సరాలకు పొడిగించాను’’ అని ఆయన చెప్పారు.