పాకిస్థాన్‌కు ట్విట్టర్ షాక్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-30 05:48:56.0  )
పాకిస్థాన్‌కు ట్విట్టర్ షాక్!
X

దిశ, డైనమిక్ బ్యూరో : భారత్‌లో పాకిస్థాన్ ప్రభుత్వానికి చెందిన అధికారిక ట్విటర్ ఖాతా నిషేధానికి గురైంది. @GovtofPakistan ఐడీతో ఉన్న వెరిఫైడ్ హ్యాండిల్‌ను ట్విట్టర్ భారత్‌లో నిలిపివేసింది. పాక్ ఐడీని ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తే.. లీగల్ డిమాండ్‌లకు అనుగుణంగా భారత్‌లో ఈ ఖాతాను నిలిపివేసినట్లు ‘ఖాతా విత్‌హెల్ద్’ అని కనిపిస్తోంది. దీంతోపాటు, రేడియో పాకిస్థాన్ @RadioPakistan ట్విట్టర్ ఖాతా సైతం నిషేధానికి గురైంది.

గురువారం సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో నోటీసుల ప్రకారం.. కంపెనీ మార్గదర్శకాలు, కోర్టు ఆర్డర్ వంటి చెల్లుబాటు అయ్యే చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనగా ట్విటర్ పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ఖాతాను భారత్‌లో బ్లాక్ చేసినట్లు పేర్కొంది. భారత్‌లో పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ట్విటర్ ఖాతాను బ్లాక్ చేయడం ఇది మూడోసారి. గతంలో రెండు సార్లు ట్విటర్ ఖాతా బ్లాక్ అయింది. 2022 జులై, అక్టోబరు నెలల్లో ట్విటర్ ఖాతాను భారత్‌లో నిషేధించడం జరిగింది.

అయితే కొన్ని నెలల తరువాత మళ్లీ పునరుద్దరించారు. తాజాగా మూడోసారి భారతదేశంలో పాకిస్థాన్ ప్రభుత్వ ట్విటర్ ఖాతా నిలిచిపోయింది. గతంలో భారతదేశంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న ఉద్దేశంతో పాకిస్థాన్‌కు చెందిన పలు యూట్యూబ్ ఛానళ్లు, ఫేస్‌బుక్ ఖాతాలను భారత్ నిషేధించిన విషయం విధితమే. కాగా, రెండ్రోజుల క్రితం బీబీసీ పంజాబీ హ్యాండిల్‌ను ట్విట్టర్ బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. లీగల్ డిమాండ్ల కారణంగా భారత్‌లో ఆ ఖాతాను నిలిపివేసినట్లు తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed