- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Tumakuru: గణేష్ నిమజ్జనంలో విషాదం.. నీటిలో మునిగి తండ్రి కొడుకులు సహా ముగ్గురు మృతి
దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలోని తుమకూరులో గణేష్ విగ్రహ నిమజ్జనం సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. 20 అడుగుల లోతున్న నీటిలో మునిగి ఓ తండ్రి, అతని ఇద్దరు కుమారులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మరసంద్ర గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు వినాయక నిమజ్జనం నిమిత్తం రంగనహట్టి సరస్సు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఇద్దరు యువకులు సరస్సులోకి దిగి లోతైన ప్రాంతంలోకి వెళ్లారు. తమ కుమారులు కనిపించకుండా పోవడంతో వారిని కాపాడటానికి తండ్రి కూడా నీటిలోకి దిగాడు. దీంతో ముగ్గురు నీటిలోనే ప్రాణాలు కోల్పోయారు. అయితే కాళ్లు బురదలో చిక్కుకున్నాయని ఈత రాకపోవడంతోనే ముగ్గురు మృతి చెందారని స్థానికులు తెలిపారు. మృతులను రేవణ్ణ (50), అతని కుమారుడు శరత్ (26), దయానంద్ (22)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు.