ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ కాల్పుల ఘటనపైనే చర్చ.. ఒక్కసారిగా పెరిగిన మద్దతు

by Shamantha N |
ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ కాల్పుల ఘటనపైనే చర్చ.. ఒక్కసారిగా పెరిగిన మద్దతు
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన కాల్పులు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన తర్వాత ట్రంప్ కు మద్దతు విపరీతంగా పెరిగిపోయింది. అధ్యక్ష ఎన్నికలో ట్రంప్ విజయావకాశాలు భారీగా పెరిగాయి. పోల్ స్టర్ ఇటీవలే విడుదల చేసిన నివేదికలో ఈ విషయం తేలింది. ఈ దాడి తర్వాత ప్రజల్లో ట్రంప్ నకు మద్దతు ఒక్కసారిగా 8 శాతం పెరిగినట్లు తెలిపింది. దీంతో, బైడెన్ కన్నా ట్రంప్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ట్రంప్‌ అధ్యక్షుడిగా గెలిచేందుకు 70శాతం అవకాశాలున్నట్లు అంచనా వేసింది. అంతేకాకుండా ప్రచారానికి విరాళాలు కూడా భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు, బుల్లెట్లు దూసుకొచ్చినా ట్రంప్ బయపడకుండా.. పైకి లేచి పైట్.. ఫైట్.. అని చేసిన నినాదాలు వైరల్ గా మారాయి. దీంతో, ట్రంప్‌కు మద్దతు తెలుపుతూ నెట్టింట కామెంట్లు గుప్పిస్తున్నారు. కాగా.. అమెరికాలో ఈ ఏడాది నవంబరులో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అధ్యక్ష రేసులో ట్రంప్ బరిలో ఉన్నారు. కాగా.. ఈ దాడి వల్ల ఆయన విజయావకాశాలు ఒక్కసారిగా పెరిగినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed