- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాతీయవాద నాయకులే రాడికల్ లెఫ్ట్ టార్గెట్: అస్సాం ముఖ్యమంత్రి
దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై కాల్పులు చోటు చేసుకోగా, ఇప్పడు ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ట్రంప్‌కు మద్దతుగా నిలిచారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జాతీయవాద నాయకులను రాడికల్ లెఫ్ట్ టార్గెట్ చేస్తుందని ఆదివారం అన్నారు. భౌతిక లేదా ఇతరత్రా దాడులు దేశం ఫస్ట్ అనే భావజాలాన్ని మాత్రం ఓడించలేవు. ఇది లోతైన ఆధ్యాత్మికతలో పాతుకుపోయింది. సనాతన తత్వశాస్త్రం నుండి ప్రేరణ పొందింది. 'జననీ జన్మభూమి చ స్వర్గాదపి గరీయసీ' అంటూ సోషల్‌మీడియా ఎక్స్‌లో అస్సాం సీఎం పేర్కొన్నారు. అలాగే, ట్రంప్‌కు మద్దతుగా నిలవండి, నేషన్ ఫస్ట్ అనే హ్యాష్‌ట్యాగ్‌లను జోడించారు. పెన్సిల్వేనియా బట్లర్ వద్ద ట్రంప్‌పై కాల్పులు జరగ్గా, ఈ ఘటనలో అదృష్టవశాత్తు బుల్లెట్ ఆయన చెవిని తాకుతూ వెళ్లగా స్వల్పంగా గాయమైంది. అలాగే, ఒకరు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. కాల్పులు జరిపిన వ్యక్తిని ఎఫ్‌బీఐ గుర్తించింది. అతన్ని 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్‌గా పేర్కొంది. ఈ ఘటనను ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు తీవ్రంగా ఖండించారు.