Justin Trudeau: ట్రూడో సన్నిహిత బృందంలో ఖలిస్థానీ వేర్పాటువాదులు..!

by Shamantha N |
Justin Trudeau: ట్రూడో సన్నిహిత బృందంలో ఖలిస్థానీ వేర్పాటువాదులు..!
X

దిశ, నేషనల్ బ్యూరో: కెనడా (Canada) ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau) పై భారత హై కమిషనర్ సంజయ్ వర్మ తీవ్ర ఆరోపణలు చేశారు. ట్రూడో సన్నిహిత బృందంలో ఖలిస్థానీ ఉగ్రవాదులు, భారత వ్యతిరేకులు ఉన్నారని ఆరోపించారు. రాజకీయ కారణాలతో వేర్పాటువాదులకు ట్రూడో ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు ఆయన ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఖలీస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్‌పై ట్రూడో‌ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని సంజయ్ వర్మ మండిపడ్డారు. నిజ్జర్ హత్యపై కెనడా చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు సమర్పించలేకపోయిందని తెలిపారు. ఖలిస్థానీ ఉగ్రవాదులు భారత కాన్సులేట్ ఎదుట అల్లర్లు చేస్తున్నా అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. సోషల్ మీడియా ద్వారా దౌత్యవేత్తలను బెదిరిస్తున్నా ఏం చేయలేదని మండిపడ్డారు.

వేర్పాటువాదుల అప్పగింతపై..

భారత్‌ పట్ల కెనడా వ్యవహరించిన తీరు ఏమాత్రం పద్దతిగా సంజయ్ వర్మ లేదన్నారు. అంతేకాదు, భారత్‌కు వెన్నుపోటు పొడిచిందన్నారు. 26 మంది వేర్పాటువాదులు, గ్యాంగస్టర్ల అప్పగింతపై ట్రూడో ప్రభుత్వాన్ని పదే పదే అభ్యర్థించిన పట్టించుకోలేదన్నారు. ఇక, కెనడాది పూర్తిగా ద్వంద ప్రమాణాలని ఫైర్ అయ్యారు. మీకు ఒక చట్టం.. మాకు మరొక చట్టం వర్తిస్తుంది అనేలా వ్యవహరిస్తుందని సంజయ్ వర్మ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed