త్రిపురలో ప్రశాంతంగా ఎన్నికలు.. పోలింగ్ శాతం ఎంతంటే..?

by Vinod kumar |
త్రిపురలో ప్రశాంతంగా ఎన్నికలు.. పోలింగ్ శాతం ఎంతంటే..?
X

అగర్తలా: త్రిపురలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 88 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారి శుక్రవారం తెలిపారు. గురువారం ఈశాన్య రాష్ట్రంలో 60 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4కే పోలింగ్ కేంద్రాలను మూసినప్పటికీ చివరి ఓటర్లు తమ ఓటు వేసే సరికి రాత్రి 9 అయినట్లు చెప్పారు. మొత్తం 28.14 లక్షల ఓటర్లలో 24.66 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు. అయితే ఇందులో పోస్టల్ బ్యాలెట్లు కలపలేదని పేర్కొన్నారు.

త్రిపురలో 2018 ఎన్నికల్లోనూ 89.38 శాతం ఓటింగ్ నమోదైంది. కాగా, ఇప్పటివరకు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక పోల్ శాతం 93 గా ఉంది. అయితే సీఎం మానిక్ సాహా శాసనసభ స్థానం బర్దొవాలీలో అత్యల్పంగా 80శాతం ఓటింగ్ నమోదు కాగా అత్యధికంగా మను స్థానంలో 92 శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను 36 స్ట్రాంగ్ రూం లలో పటిష్ట భద్రత మధ్య ఉంచినట్లు చెప్పారు. నిరంతరం సీసీటీవీ పర్యవేక్షణలో ఉంచామన్నారు. వచ్చే నెల 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed