- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పుల్వామా యుద్ధంలో నింగికెగసిన అమరవీరులకు జోహార్లు
దిశ డైనమిక్ బ్యూరో: ఫిబ్రవరి 14 వ తేదీ అనగానే కొంతమంది యువతీ యువకులకు గుర్తుకు వచ్చేది ప్రేమికుల రోజు. కానీ దేశాన్ని ప్రేమించే ఎందరికో గుర్తుకు వచ్చేది పుల్వామా దాడి. అందుకే దేశాన్ని ప్రేమించే వారు భారత సైన్యం ఫిబ్రవరి 14 వ తేదీని బ్లాక్ డేగా భారత దేశ చరిత్రలోనే అత్యంత అశుభదినంగా పేర్కొంటారు. 2019 ఫిబ్రవరి 14 వ తేదీన జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ విధుల నిమిత్తం 70 వాహనాల్లో బక్షి స్టేడియంకు వెళ్తున్న సమయంలో పేలుడు పదార్ధాలు ఉన్న ఓ కారు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ప్రయాణిస్తున్న ఓ బస్సు పైకి దూసుకు వచ్చింది.
ఈ దాడిలో 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)సైనికులు, ఒక ఉగ్రవాది మరణించారు. ఇక బాంబు దాడికి గురైన వాహనం పక్కన ఉన్న వాహనాలపై కూడా ఈ ప్రభావం పడింది. ఈ ఘటనలో చాలంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే దాడి జరిగిన కొంత సమయం తరువాత ఈ దాడి చేసింది మేమేనని ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ ప్రకటించింది. నేటికి ఈ ఘటన జరిగి ఐదు సంవత్సరాలు గడుస్తున్నా నేటీకి ఆ దుర్ఘటన కళ్ళముందు కదలాడుతున్నది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
దేశ సేవకై కుటుంబాలను వదిలి, గడ్డకట్టించే చలిలో, బొబ్బలు రేపే ఎడారిలో గస్తీ కాస్తూ.. కుటుంబాలకు దూరంగా గడియగడియ గండమైన ఆత్మస్థైర్యంతో ముందుకెల్తూ.. భారత భూభాగంలో అడుగుపెట్టాలని చూసే శత్రువుల గుండెలు చీల్చి.. దేశ సేవలో చివరి శ్వాస విడిచి భూమాత ఒడిలో నిదురపోతున్న భారత మాత ముద్దు బిడ్డలకు జోహార్లు.