ఢిల్లీ ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన ట్రాన్స్ జెండర్

by Mahesh |
ఢిల్లీ ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన ట్రాన్స్ జెండర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఢిల్లీలోని మున్సిపల్‌ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో తొలిసారి ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీకి చెందిన ఓ వ్యక్తి మున్సిపల్ కార్పోరేషన్‌లో ఆప్ తరపున విజయం సాధించారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాల్లో సుల్తాన్‌పురి-ఎ వార్డు నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి, ట్రాన్స్‌జెండర్‌) బాబీ కిన్నార్‌ గెలిచారు. ఇందులో ఆప్ తరపున పోటీ చేసిన బాబీ 6,714 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి వరుణ ఢాకాను ఓడించారు. అయితే, సామాజిక కార్యకర్త అయిన 38 ఏళ్ల బాబీ అన్నా హజారే ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆమ్‌ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేశారు.

2017లో జరిగిన ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇటీవల జరిగిన ఎంసీడీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ బాబీకి టికెట్‌ ఇచ్చింది. ఢిల్లీలో ఓ టాన్స్‌జెండర్‌ అభ్యర్థికి ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వడం కూడా ఇదే తొలిసారి. కాగా, తన గెలుపు అనంతరం బాబీ మాట్లాడుతూ...పార్టీకి ప్రాతినిధ్యం వహించడానికి గెలిచిన తాను, తన నియోజకవర్గాన్ని అందంగా తీర్చిదిద్దాలని, తన నియోజకవర్గ ప్రజల జీవితాలను మెరుగు పరచాలని కోరుకుంటున్నట్లు బాబీ చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంపీడీ) నుంచి అవినీతిని పారద్రోలేందుకు కృషి చేస్తానని బాబీ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed