వారి వేధింపులు తాళలేక ట్రాన్స్ మహిళ కానిస్టేబుల్ రాజీనామా

by Mahesh |
వారి వేధింపులు తాళలేక ట్రాన్స్ మహిళ కానిస్టేబుల్ రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: పోలీసు శాఖలో పై అధికారుల వేధింపులు తాలలేక ఓ ట్రాన్స్ మహిళా కానిస్టేబుల్ రాజీనామా చేసింది. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం తమిళనాడు పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఉద్యోగం సాధించిన ళిత లింగమార్పిడి మహిళ ఆర్ నజ్రియా.. తనతో పాటు పని చేసేవారు తనను కులం, లింగం ఆధారంగా వేధింపులకు గురిచేస్తున్నారని తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఈ సందర్భంగా తను.. కోయంబత్తూరు పోలీస్ కమీషనర్‌కి రాసిన లేఖలో, "నిజాయితీ లేని ఉన్నత అధికారుల క్రింద పని చేయాలని నేను కోరుకోవడం లేదు.. నేను వెళ్ళిన ప్రతి చోట వేధింపులు ఎదుర్కొన్నాను" అని ఆమె పేర్కొంది.

Advertisement

Next Story