Tram: కోల్‌కతాలో ట్రామ్ సేవల నిలిపివేత.. ముగియనున్న151 ఏళ్ల ప్రయాణం !

by vinod kumar |
Tram: కోల్‌కతాలో ట్రామ్ సేవల నిలిపివేత.. ముగియనున్న151 ఏళ్ల ప్రయాణం !
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లోని కోల్ కతాలో 151 ఏళ్లుగా నడుస్తున్న ట్రామ్ సర్వీసును నిలిపివేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ నుంచి వీటిని ఆపివేస్తామని గతంలోనే ప్రకటించింది. దీంతో మంగళవారం నుంచి ఈ సర్వీసులు నిలిచిపోనున్నట్టు తెలుస్తోంది. దీనిపై పలువురు సోషల్ మీడియాలో తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కోల్ కతా ప్రజల జీవనాడిని చరిత్రలో కనుమరుగు చేయడం సరికాదని పేర్కొంటున్నారు. ట్రామ్ సర్వీసును మూసివేస్తున్నట్లు ప్రకటించడాన్ని నిరసిస్తూ పలువరు ఆందోళనలు సైతం తెలుపుతున్నారు. కోల్‌కతా ప్రజలకు ఎంతో సేవలందించిన ఈ బస్సు సర్వీసు నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేంది. కాగా, కోల్‌కతాలో ట్రామ్ సర్వీస్‌లను 1873లో ప్రారంభించారు. 2023లో ట్రామ్ సేవలకు 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా సంబురాలు సైతం జరుపుకున్నారు. ఆ సమయంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, ఇతర అధికారులు కేక్ కట్ చేశారు. అయితే ట్రామ్‌లు నెమ్మదిగా ప్రయాణిస్తామని, కానీ ప్రస్తుత కాలంలో ప్రజలకు వేగవంతమైన ప్రయాణం అవసరమని అందుకే వీటి సేవలను నిలిపివేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed