ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌కు భారీ షాక్.. శిక్షణ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

by Mahesh |   ( Updated:2024-07-16 12:56:05.0  )
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌కు భారీ షాక్.. శిక్షణ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్: అధికార దుర్వినియోగం ఇష్యూలో ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌కు భారీ షాక్ తగిలింది. ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (LBSNAA)కి తిరిగి రావాలని ట్రైనీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి పూజా ఖేద్కర్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశించింది. మహారాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి నితిన్ గాద్రే జారీ చేసిన లేఖ ప్రకారం.. ఎల్‌బిఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సోరీ డాక్టర్ పూజ ఖేద్కర్ యొక్క జిల్లా శిక్షణ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. అలాగే ఆమెను ఈ నెల 23 లోపు ఎల్‌బిఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. కాగా ప్రత్యేక కార్యాలయం, అధికారిక కారు కోసం ఆమె ఆరోపించిన డిమాండ్లు, ఆమె ప్రైవేట్ కారుకు ప్రత్యేక సైరన్‌తో పాటు బీకాన్‌ను అనధికారికంగా ఉపయోగించింది. దీంతో ఈ నెల ప్రారంభంలో, పూణే జిల్లా కలెక్టర్ సుహాస్ దివాసే కూడా పూజ, ఆమె తండ్రి "అభ్యంతరకరమైన ప్రవర్తన" గురించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. అలాగే ఆమో అడ్డదారుల్లో ఐఏఎస్ అయినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌ పై చర్యలు తీసుకున్నారు.

Advertisement

Next Story