ఛాంపియన్స్ బై బై.. 2025లో మళ్లీ కలుద్దాం

by Shamantha N |
ఛాంపియన్స్ బై బై.. 2025లో మళ్లీ కలుద్దాం
X

దిశ, స్పోర్ట్స్ : 2024 ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు సీజన్-17 టోర్నీ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును చిత్తు చేసిన కేకేఆర్ ఐపీఎల్‌ హిస్టరీలో మూడోసారి కప్‌ను ఎగరేసుకుపోయింది. దీంతో అత్యధిక సార్లు కప్ గెలిచిన జట్లలో ముంబై, చెన్నయ్ తర్వాత మూడో స్థానంలో కేకేఆర్ టీం (మూడు సార్లు విజేతగా) నిలిచింది. ఇదిలాఉండగా, తాజాగా కోల్‌కతా ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ పై ఫ్రాంచైజీ ఓనర్ షారుఖ్ ఖాన్ ప్రశంసలు కురిపించారు.‘ మా ఛాంపియన్లు అద్భుతంతా ఆడారు. సమిష్టి కృషితో విజేతగా నిలిచారు. ఈ ప్రయాణంలో మెంటార్ గౌతమ్ గంభీర్ మార్గదర్శకత్వం మరువలేనిది. కోచింగ్ సభ్యులు అంకిత భావంతో పనిచేశారు.శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో జట్టులోని ఆటగాళ్లు అందరూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ టోర్నీలో కేకేఆర్‌పై ప్రేమ చూపిన ప్రతీ అభిమానికి ప్రత్యేక కృతజ్ఞతలు. 2025‌లో మళ్లీ కలుద్దాం’ అంటూ షారుఖ్ ఖాన్ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed