- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నన్ను చంపేందుకు రూ. 50 లక్షల కాంట్రాక్ట్ ఇచ్చారు: మహారాష్ట్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎమ్మెల్యే ఛగన్ భుజ్‌గల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను చంపడానికి కొందరికి రూ.50లక్షల కాంట్రాక్ట్ ఇచ్చారని అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నా కార్యాలయానికి బెదిరింపు లేఖ వచ్చింది. నన్ను చంపేందుకు ఐదుగురు వ్యక్తులకు రూ.50 లక్షల కాంట్రాక్టు ఇచ్చినట్లు అందులో ఉంది. కొన్ని కార్ల నంబర్ ప్లేట్లు, కొన్ని ఫోన్ నంబర్లు, ఎక్కడెక్కడ సమావేశాలు జరిగాయి అనే వివరాలు కూడా ఉన్నాయి’ అని తెలిపారు. గత కొద్ది రోజులుగా బెదిరింపు కాల్స్ సైతం వస్తున్నట్టు చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇటువంటి బెదిరింపులు ఎన్నో ఎదుర్కొన్నట్టు చెప్పారు. ఎప్పటిలాగే తన కార్యాలయానికి వచ్చిన లేఖను పోలీసులకు అందజేసినట్టు వెల్లడించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఛగన్‌కు అదనపు భద్రత కేటాయించే విషయంపైనా చర్చిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఛగన్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వర్గంలో చేరి ఇటీవలే మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల సంఘం మంగళవారం అజిత్ నేతృత్వంలోని వర్గానికి ఎన్‌సీపీ పేరు, గుర్తును కేటాయించిన కొద్ది రోజుల తర్వాత ఈ బెదిరింపు రావడం గమనార్హం. అయితే మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా..ఈ నిర్ణయాన్ని భుజ్ గల్ వ్యతిరేకించినట్టు తెలుస్తోంది.