- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Encounter: జమ్ము కశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
దిశ, నేషనల్ బ్యూరో: జమ్ము కశ్మీర్(Jammu Kashmir)లో మరో ఎన్‌కౌంటర్(Encounter) చోటుచేసుకుంది. ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్ మొదలైంది. ఈ కాల్పుల్లో జవాన్లు ప్రాణాలను రక్షించుకున్నారు. ఆ తర్వాత ఉగ్రవాదులపై యాక్షన్ మొదలు పెట్టారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గరు ఉగ్రవాదుల(Militants)ను బలగాలు మట్టుబెట్టాయి. జమ్ము జిల్లా అఖ్‌నూర్ ఏరియాలో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది.
జమ్ములో ఖౌర్ ఏరియాలోని ఎల్‌వోసీ సమీపంగా ఆర్మీ అంబులెన్స్ కాన్వాయ్ వెళ్లుతుండగా ఉగ్రవాదులు చూశారు. మొబైల్ ఫోన్ కోసం ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులు ఈ కాన్వాయ్ చూడగానే కాల్పులకు తెగబడ్డారు. దాదాపు ఓ పది రౌండ్లు కాల్పులు జరిపారు. కానీ, వాహనాల్లోని భద్రతా సిబ్బందికి గాయపడలేదు. ఉగ్రవాదుల దాడికి మిలిటరీ ప్రతిదాడి చేపట్టింది. ఆ ఏరియాలో వెంటనే కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. దీంతో ఉగ్రవాదులు సమీపంలోని అడవిలోకి వెళ్లారు. జవాన్లు కూడా అక్కడికి వెళ్లడంతో ఉభయవర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఘటనాస్థలిలో గుర్తుతెలియని ముగ్గురు సాయుధుల మృతదేహాలు లభించినట్టు ఓ సీనియర్ పోలీసు అధికారి ధ్రువీకరించారు.